2010-11 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో శనివారం మధ్యాహ్నం శాసనసభలో ప్రవేశపెట్టారు. అలాగే, శాసనమండలిలో మంత్రి గాదె వెంకటరెడ్డి సమర్పించారు. ఓట్ ఆన్ అకౌంట్‌తో కలిపి రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. గతంలో 15 సార్లు ప్రవేశపెట్టిన రికార్డు హిమాంచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రా సింగ్ పేరిట ఉంది. ఆ రికార్డును కొణిజేటి రోశయ్య చెరిపివేశారు. కాగా, వార్షికబడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రం మొత్తం బడ్జెట్ రూ.1,13,660 కోట్లు
మొత్తం రెవెన్యూ ఆదాయం రూ.62,702 కోట్లు
కేంద్ర పన్నుల వాటా రూ.14,505 కోట్లు
కేంద్ర గ్రాంట్లు రూపేణా వచ్చే ఆదాయం రూ.13,441 కోట్లు
మూలధన వసూళ్ళు ద్వారా రూ.23,027 కోట్లు
ద్రవ్య లోటు అంచనా రూ.12,983 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.73,347 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ.40,313 కోట్లు
వివిధ శాఖల కేటాయింపుల తీరిది..
నీటిపారుదల శాఖకు రూ.15,011 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.3,842 కోట్లు
ఆరోగ్యశ్రీ పథకం అమలుకు రూ.925 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.1,800 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.4,313 కోట్లు
వ్యవసాయానికి రూ.3,104 కోట్లు
విద్యాశాఖకు రూ.3,155 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.1.860 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,284 కోట్లు
వ్యవసాయం, అనుబంధ శాఖలకు రూ.18,039 కోట్లు
గ్రామీణ సురక్షిత మంచినీటి సరఫరాకు రూ.3,019 కోట్లు
ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.300 కోట్లు
వైఎస్సార్ అభయహస్తం పథకానికి రూ.220 కోట్లు
వివిధ రకాల పింఛన్ల కోసం రూ.1.292 కోట్లు
పావలా వడ్డీ సబ్సిడీ కోసం రూ.200 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.1,721 కోట్లు
చేనేత రుణ మాఫీకి రూ.312 కోట్లు
ఆహార సబ్సిడీకి రూ.3,000 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,830 కోట్లు
పాఠశాల విద్యకు రూ.9,824 కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.1909 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ.237 కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి రూ.1,846 కోట్లు
రాజీవ్ యువశక్తి పథకం అమలుకు రూ.312 కోట్లు
ప్రాంతీయ అసమానతల తొలగింపు నిధికి రూ.383 కోట్లు
ఎస్సీల ఉపకార వేతనాలు, బోధనా ఫీజులకు రూ.536 కోట్లు
ఈబీసీ విద్యార్థులకు ఉపకాల వేతనాలకు రూ.300 కోట్లు
గిరిజన ఉపకార వేతనాలు, బోధనా ఫీజులకు రూ.193 కోట్లు
బీసీల ఉపకార వేతనాలు, బోధనా ఫీజులకు రూ.1,032 కోట్లు
ఏపీ పురపాలక సంఘ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.1,670 కోట్లు
వికలాంగుల ఉపకార వేతనాలకు రూ.7 కోట్లు
పంట నష్టం కింద రైతులకు రూ.821 కోట్లు
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.383 కోట్లు
శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధిగా రూ.కోటి
================================
(source-MSN News)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment