Friday, February 12, 2010
24 గంటల్లో ఏ క్షణమైనా విధి విధానాలు: చిదంబరం
రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను వచ్చే 24 గంటల్లో ఏ క్షణమైనా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖామంత్రి చిదంబరం తెలిపారు. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విధి విధానాలు ఖరారైనట్టు చెప్పారు. వీటిని వచ్చే 24 గంటల్లో విడుదల వెల్లడించవచ్చని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ కేబినెట్‌లో పెట్రో వడ్డన, తెలంగాణ అంశంపై చర్చ జరగలేదన్నారు. ప్రధానంగా చర్చను 13వ ఆర్థిక సంఘం సిఫార్సులపైనే చర్చించినట్టు చెప్పారు. ఈ సిఫార్సులను యధావిధిగా కేబినెట్ ఆమోదించినట్టు ఆయన చెప్పారు.
========================================
తెలంగాణపై రెండుగా చీలిన కాంగ్రెస్ కోర్ కమిటీ? గురువారం, 11 ఫిబ్రవరి 2010( 11:24 IST )
తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ (సీసీసీ) సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కమిటీ రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఫలితంగా కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై ప్రకటన నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. శ్రీకృష్ణ కమిటీ కోసం హోం శాఖ రూపొందించిన విధి విధానాలపై కాంగ్రెస్ కోర్ కమిటీ బుధవారం సాయంత్రం ఏకబిగువున 90 నిమిషాల పాటు చర్చించిన విషయం తెల్సిందే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, హోం మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీలు పాల్గొన్నారు. అయితే, తెలంగాణ సమస్యకు ఏదో విధంగా ఫుల్‌స్టాఫ్ పెట్టాలని పలువురు సభ్యులు అభిప్రాయపడినట్టు సమాచారం. మరికొంత మంది సభ్యులు వీరితో విభేదించారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదని అందువల్ల ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారట.
మొత్తం మీద శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై చర్చించినప్పటికీ.. కోర్ కమిటీ మాత్రం తుది నిర్ణయం తీసుకోలేక పోయింది. అంటే.. సీసీసీ సభ్యులే ఈ అంశంపై రెండుగా చీలిపోవడం వల్ల తెలంగాణపై వ్యతిరేక సంకేతాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని తెరాస చీఫ్ కే.చంద్రశేఖర రావు గ్రహించడం వల్లే బుధవారం సాయంత్రం హడావుడి చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కే.కేశవరావు ఇంటికి హుటాహుటిన వెళ్లి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత తెలంగాణపై వెనకడుగు వేస్తే ఏ త్యాగానికైనా సిద్ధమని కేసీఆర్ మీడియా ఎదుట ప్రకటించారు. మొత్తం మీద సీసీసీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వల్ల విధి విధానాలపై ప్రకటనను మరో రెండు రోజుల వరకు చేయరాదని హోం శాఖ నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
=====================
(source: MSN News)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment