సోమవారం, 1 ఫిబ్రవరి 2010( 13:33 IST )
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని గత నెల ఐదో తేదీన ప్రకటించినట్టు, ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. ఇందుకోసం కమిటీనా లేదా యంత్రాంగమా అనేది ఈ వారంతంలో వెల్లడిస్తామని, అంతవరకు వేచి చూడాలని ఆయన కోరారు. దీనిపై ఆయన సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత వారం తాను చేసిన ప్రకటన చేస్తూ.. ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన చేశామని, దీనికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అంతవరకు వేచి చూడాల్సిందిగా ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు. ఈ అంశంపై విధి విధానాలపై ఎలాంటి దాపరికం లేదన్నారు. వీటిని రూపొందించిన తర్వాత అన్ని బహిర్గతం చేస్తామన్నారు.
ఇకపోతే.. నక్సలైట్ల నిరోధానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పని చేస్తున్నట్టు చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ విస్తృత వినియోగానికి ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నక్సలైట్ల నిరోధక చర్యలు సమర్థవతంగా సాగుతున్నాయని తెలిపారు. మయన్మార్, భారత్‌ల మధ్య నిఘా విభాగ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు. ఇకపోతే... జమ్మూకాశ్మీర్‌లో చొరబాట్లను సైన్యం సమర్థవంతగా తిప్పికొట్టిందన్నారు. మార్చి నెలాఖరులోగా 42 ఇమ్మిగ్రేషన్ పోస్టులను ఆధునకీకరిస్తామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల హింస పెరిగిపోతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసు వ్యవస్థను ఆధునకీకరించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం 89.1 కోట్ల రూపాయలను వివిధ రాష్ట్రాలకు విడుదల చేసినట్టు తెలిపారు.
(source : MSN News)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment