తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంశంపై కేంద్ర హోం మంత్రి చిదంబరం వేయనున్న కమిటీ అంత ఆషామాషీది కాదని నర్సాపురం ఎంపీ, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మంగళవారం ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఈ కమిటీని తక్కువ అంచనా వేయరాదని హెచ్చరించారు.డిసెంబరు తొమ్మిదో తేదీన చిదంబరం చేసిన చిన్నపాటి ప్రకటనతో మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా కొత్త రాష్ట్రాల డిమాండ్లు తలెత్తాయన్నారు. ప్రధానంగా రాష్ట్రాన్ని విభజించనున్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన మరుక్షణమే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ఉవ్వెత్తున ప్రజలు ప్రజలు ఉద్యమించారన్నారు. అందువల్ల మంత్రి చిదంబరం త్వరలో చేయనున్న ప్రకటనను అంత సులభంగా తీసుకోరాదని ఆయన సూచించారు. అన్ని అంశాలను బేరీజు వేసి, దేశంలో మరిన్ని డిమాండ్లు తలెత్తకుండా ఉండేలా ఈ ప్రకటన ఉంటుందన్నారు. అదేసమయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన జరగడం అంత సులభతరం కాదన్నారు.
అందువల్ల సీమాంధ్ర నేతలతో పాటు.. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇకపోతే.. చిదంబరంపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి హోదాలోనే ప్రకటనలు చేస్తున్నారని, ఆయన చేసే ప్రకటనలను వ్యక్తిగతంగా చూడరాదని ఎంపీ కనుమూరి హితవు పలికారు.
(source :MSN News)
=========================
(source : eenadu)
No comments:
Post a Comment