బుధవారం, 3 ఫిబ్రవరి 2010( 11:00 IST )
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం నేతృత్వంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వం వహిస్తారు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఆర్థిక, న్యాయ నిపుణులు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్ రణబీర్ సింగ్, అబూసలే షరీఫ్, రవీందర్ కౌర్, వినోద్ దుగ్గల్‌లు ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ పేరును ప్రస్తావించకుండానే ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. అలాగే, కమిటీ విధి విధానాలు, కాలపరిమితి, తదితర అంశాలను కూడా వెల్లడించలేదు. వీటితో పాటు కమిటీ తెలంగాణ అంశాన్ని ఇవ్వాలా లేదా అనే అంశాన్ని కూడా ఖరారు చేసే అధికారం కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం లేక ఇవ్వక పోవడం అనేది కేంద్రమే నిర్ణయించనుంది.
ఈ కమిటీ కేవలం ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మాత్రం ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా, ఈ కమిటీపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తెదేపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేకపోయినా.. చిదంబరం పర్యవేక్షణలో కమిటీ ఉండటాన్ని మాత్రం తాము అంగీకరించబోమని తెదేపా నేత మైసూరా రెడ్డి స్పష్టం చేశారు.
==============================================
కేవలం సంప్రదింపులకు మాత్రమే శ్రీకృష్ణ కమిటీ
జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సంప్రదింపులకు మాత్రమే అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రజలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరిస్తుంది. అయితే, ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులకు స్థానం కల్పించినట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ కమిటీలో చోటు కల్పించిన ఐదుగురు సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో రంగానికి చెందిన వారు కావడం గమనార్హం. కమిటీ ఛైర్మన్‌గా జస్టీస్ శ్రీకృష్ణ సుప్రంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పని చేశారు. ఇక కమిటీలోని మిగిలిన సభ్యులల్లో వీకేదుగ్గల్ ఒకరు. ఈయన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. రవీందర్ కౌర్.. న్యూఢిల్లీలోని ఐఐటీ సామాజిక శాస్త్రవేత్త. రణబీర్ సింగ్.. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇకపోతే.. అబూసలేం షరీఫ్.. ప్రపంచ ఆహార ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్‌గా పని చేస్తున్నారు. ఈ కమీటీలో ముగ్గురు ప్రొఫెసర్లు, న్యాయ, ఆర్థిక నిపుణులు కావడం గమనార్హం.
=================================================
ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్: ధర్మపురి
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. దీనిపై శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో స్పందన తెలియజేస్తూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం వేసిన కమిటీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన మాటను తప్పే పార్టీ కాంగ్రెస్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించిందన్నారు. అందువల్ల కేంద్రం తీసుకునే చర్యలకు ప్రతి పార్టీ, ప్రతి నేత సహకరించాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారానికి కమిటీ వేసినందువల్ల అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిదేనని డీఎస్ అభిప్రాయపడ్డారు.
==============================================
కమిటీని స్వాగతించిన ఏలూరు ఎంపీ కావూరి
రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు, అన్ని వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం కేంద్రం వేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని స్వాగతిస్తున్నట్టు సీమాంధ్ర ప్రాంత ప్రతినిధి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ప్రకటించారు. దీనిపై ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర హోం శాఖ ప్రకటించిన కమిటి తమకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. తమతో పాటు అందరికీ ఈ కమిటీ ఆమోదయోగ్యమనే భావిస్తున్నామన్నారు. అందువల్ల ఇక ఆందోళనలు, దీక్షలు విరమించి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపోతే.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు కమిటి ఏర్పడిందని జేసీ తెలిపారు. ఈ కమిటీపై ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, రాష్ట్ర పాలన సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
===========================================
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తున్నాం: కోడెల
జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రెండు కమిటీలు ఉన్నాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కె.రోశయ్యలతో వేసిన కమిటీలను పక్కనబెట్టి ఇప్పుడు కొత్తగా మరో కమిటీ వేయడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యయనం కోసం కమిటీ వేస్తే దానిమీదే పని చేయాలని అన్నారు. అన్ని ప్రాంతాల్లో అధ్యయనం చేసి ప్రజల మనోభావాలను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కమిటీ రాష్ట్ర విభజన అంశంపై పని చేస్తే మాత్రం సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొంగాట ఆడుతోందన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్రాన్ని ముక్కలు చేసేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. అందువల్ల ఈ కమిటీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఉన్న రెండు కమిటీల ఏర్పాటు వల్ల ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.
===========================================
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment