గురువారం, 28 జనవరి 2010( 15:41 IST )
తెలంగాణ సమస్య పరిష్కారికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఇందుకోసం ఫిబ్రవరి మొదటి వారంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీలో ఉండే సభ్యుల పేర్లను ఈ వారంతంలో ఖరారు చేస్తామని తెలిపారు. ఈ అంశంపై ఆయన గురువారం ఢిల్లీలో స్పందించారు. అందులో తెలంగాణ అంశంపై కేంద్రం అనుసరించనున్న భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించారు. అప్పటి వరకు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తెలంగాణ అంశం తుది దశలో ఉందని చిదంబరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
ఇదిలావుండగా, హోం మంత్రి విడుదల చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందనే విషయం ఈ ప్రకటనతో రూఢీ అయిందన్నారు. ఇందుకోసం చొరవ చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కె.జానారెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డిలు ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
==========================
(source : msn news)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment