రాష్ట్ర విభజన అంశంపై ఢిల్లీలో కీలక చర్చలు మంగళవారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. కేంద్ర హోం మంత్రి చిదంబరం అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశానికి ఎనిమిది పార్టీల తరపున ఇద్దరేసి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ చర్చల ప్రక్రియను పూర్తిగా వీడియో చిత్రీకరిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనే ప్రతినిధులు ఏమేమి మాట్లాడుతారో ఇందులో రికార్డు కానుంది. భవిష్యత్‌లో తెలంగాణ అంశంపై చర్చలు జరిగిన పక్షంలో ఇవి దోహదపడుతాయని హోంశాఖ భావిస్తోంది. కాగా, ఈ చర్చల్లో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు హోంశాఖ కృషి చేయనుంది. ఇది సాధ్యమయ్యే వాతావరణం పార్టీల మధ్య ఏమాత్రం కనిపించడం లేదు.
ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సీపీఐలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజారాజ్యం, సీపీఎం పార్టీలు విశాలాంధ్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో మంచి పట్టున్న మజ్లీస్ పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇకపోతే.. రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఇలాంటి తరుణంలో జరుగుతున్న అత్యంత కీలకమైన చర్చల్లో ఎలాంటి ఫలితం రాని పక్షంలో కేంద్రం సీరియస్‌గానే పరిగణించనుంది.
ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏర్పడేందుకు రాష్ట్ర రాజకీయ పార్టీలు ఏమాత్రం సహకరించని పక్షంలో కొన్ని నెలల పాటు రాష్ట్రపతిపాలన విధించి, దారికి తీసుకుని రావాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.
(msn news)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment