గురువారం, 14 జనవరి 2010( 11:27 IST )
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ జేఏసీ ఈ నెల 28 తేదీని డెడ్ లైన్‌గా ప్రకటించడంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా ఏ పార్టీకి చెందిన వారు అతిగా ప్రవర్తించకండని ఆయన హితవు పలికారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సంప్రదింపుల ప్రక్రియే ప్రధానమని ఉద్ఘాటించారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో తెలంగాణ అంశంపై సంప్రదింపులను చేపట్టారని గుర్తు చేశారు. ఇకపై రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా అతిగా వ్యవహరించరాదని తివారీ హితవు పలికారు.
(source : MSN)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment