రాష్ట్ర విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కోస్తా, రాయలసీమలో ఇంతటి స్పందనలు రావటం ఊహిం చని విషయం. అయితే ఇందులో రకరకాల ఆలోచనలు కలిసిపోయి ఉన్నాయి. సమైక్యత కోరేవారు, ప్రత్యేకాంధ్ర కోరేవారు, గ్రేటర్ రాయలసీమ అనేవారు, తెలంగాణ వేరుపడినా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే సమాధానపడేవారు ఉన్నారు. ఎక్కువగా ప్రచా రంలో కన్పిస్తున్నది మాత్రం 'సమైక్యాంధ్ర నినాదం. అదే విధంగా ఒక విస్తారమైన ప్రాంతంలో, రాష్ట్ర జనాభాలో సగానికి పైగామంది, ఈ పరిణామాలపట్ల ఆందోళన చెందు తున్నా రన్నది స్పష్టం.
వారి ప్రశ్నలకు తగు జవాబులను కనుగొని సమాధానపరచవలసిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన, ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్ఠానంపైన ఉంది. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కోస్తా-రాయల సీమలకు, తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి కూడా. ఎంత తాత్సారం జరిగితే అందరికీ అంత నష్టం కలుగుతుంది. విచారకరమేమంటే ఈ పరిణామాలు గురువారం ఉదయం నుంచి మొదలు కాగా శుక్రవారం గడిచిపోతున్నా ఈ దిశలో తగు ప్రయత్నాలు కన్పించటంలేదు. శాంతి సంయమనాలు చూపాలని ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య శుక్రవారం పగలు అందరికీ విజ్ఞప్తి చేసారు.
బహుశా ఇతరపార్టీలు కూడా రాత్రిలోగా ఆ పని చేయవచ్చు. ఇది ప్రశంసించ దగ్గదేగాని, పరిస్థితికి కీలకం ఢిల్లీలో ఉంది. తెలంగాణ గురించిన ప్రకటన అక్కడి నుంచి వెలువడి ఈ పర్యవ సానాలు సంభవిస్తున్నందున, అవసర చర్యలు గైకొనవల సింది కూడా అక్కడనే. అక్కడ పార్టీ అధిష్ఠానంగాని, ప్రభుత్వ బాధ్యులుగాని ఇప్పటికీ తగు పార్టీ ఎంపిలతో మూసిన గదుల్లో కూర్చుని మాట్లాడటానికి పరిమితమవు తున్నారు. ఇదే వారచేస్తున్న పెద్ద పొరపాటు. తమ పార్టీవాదులతో మాట్లాడటంతోపాటు నేరుగా ప్రజలతో మాట్లాడటం అవసరమని వారెందుకు గ్రహించటంలేదో తెలియదు.
తమకు విషయాలు పూర్తిగా తెలుసు, అవ గాహన ఉంది, అయినా ఈ చిన్న సంగతి తట్టకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సమస్య ఎంపిలతో మాట్లాడటం వల్ల తేలిపోయేది అయితే గురు, శుక్రవారాల సమావేశాల ఫలితంగా అది జరిగిపోవలసి ఉంది. కనుక ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.పోతే, సమైక్యత పట్ల ఇంత ప్రగాఢమైన కోరిక ఉండటం విశేషమే. కాని, కోరుతున్నది భౌగోళిక సమైక్యతనా లేక భావ సమైక్యతనా లేక రెండింటినా అన్నది స్పష్టం కావటం లేదు. ఇపుడు భౌగోళిక సమైక్యత ఉందిగాని భావ సమై క్యత లేదన్నది తెలంగాణప్రాంతం వారి ఫిర్యాదు.
యాభ య్యేళ్ళు గడిచినా భావసమైక్యత లేనపుడు కలిసి ఉండటం ఎట్లాగన్నది ప్రశ్న. భావ సమైక్యత సిద్ధించకపోవటానికి కారణాలు ఏమిటో, కారకులెవరో వారు పేర్కొంటున్నారు. అందుకెవరైనా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయ గలరా? భావ సమైక్యత లేని భౌగోళిక సమైక్యత ఎట్లా పనిచేసి ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో మనం చూస్తూనేఉన్నాం. అటువంటిస్థితిలో సమైక్యత అనే మాటను పొడిపొడిగా వాడటమంటే, భావ సమైక్యత లేకున్నా ఫరవాలేదు భౌగోళిక సమైక్యత ఉంటే చాలునని భావిస్తున్నారనే అర్ధం వస్తుంది.
ఒకవేళ ఉద్దేశం అదే అయితే ఆ మాట ధైర్యంగా, నిజాయితీగా చెప్పాలి. ఒకవేళ ఉద్దేశం అదైనా, అది సమైక్యతావాదం పేరిట ఉద్యమిస్తున్న అందరి ఉద్దేశమనలేము. కొందరిది కావచ్చు. భావసమైక్యత లేనప్పటికీ భౌగోళిక సమైక్యత కొనసాగినట్లయితే తమ రియల్‌ఎస్టేట్, పారిశ్రామిక తదితర వ్యాపారాలు సజావుగా సాగుతాయన్న ఆలోచన వారికి ఉండవచ్చు. కాని అందరి సమైక్యతావాదం ఈ విధమైన భౌగోళిక సమైక్యతా వాదమా? అవుననలేము. కాని రెండవ వర్గపు ఆందోళనా భావాలు మొదటివారికి బాగా ఉపయోగపడుతున్నాయి.
ఈ మొదటి వర్గం తన కార్యకలాపాలతో, భావ సమైక్యత పెంపొందని పరిస్థితులను గత యాభయ్యేళ్ళుగా సృష్టించి నందువల్లనే సమస్య తలెత్తి, జటిలమై, ఇంతవరకు వచ్చింది. వీరికి ఇప్పటికీ కావలసింది భౌగోళిక సమైక్యత ేగాని భావసమైక్యత కాదు. అందుకు దోహదం చేయగల పరిస్థితుల సృష్టి అంతకన్నాకాదు. ఈ స్థితినే కొంత పొడిగించి చెప్తే, వీరి భౌగోళిక సమైక్యత ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో ముడిబడి ఉంది. దానిని కేంద్ర పాలితం చేసి తాము నియంత్రించగల అవకాశం ఉంటే వారికి తెలంగాణతో సమైక్యత కూడా అక్కరలేదు. అందుకే నాయకులు, వ్యాపారులలో కొందరు ఆ మాట బయటకే అంటున్నారు. ఈ స్థితిని సాధారణ ప్రజలు ఆమోదించ గలరని భావించలేము.
(వార్త )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment