గెలుపే గమ్యం
==============
ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకూ, అలుపు లేదు మనకు
బతుకు అంటే గెలుపూ, గెలుపు కొరకే బతుకు
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ, ఏమైనా గానీ ఎదురేదిరానీ
ఓడి పోవద్దు రాజీ పడొద్దు, నిద్ర నీకొద్దు నీకేది హద్దు
====
రాబోయే విజయాన్ని, పిడికిలిలో చూడాలి
ఆ గెలుపు తప్పట్లే, గుండెలలో మోగాలి
నీనుదిటి రేఖలపై, సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే, చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే, నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం,
నీలికళ్ళలో మెరుపే మెరవాలి, కారుచీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి, తగిలేగాయాల్లో గేయం వూదాలి.
========
నిదరోతూ నిలుచుంటా, వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటి బొట్టువలె
అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా
రాశిగపోసిన కలలన్నీ దోసిలినిండా నింపిస్తా ,
చేతులుచాచిన స్నేహంలా
ముట్టుకున్నవా - మువ్వా అవుతుంది
పట్టుకున్నవా - పాటే అవుతుంది
అల్లుకున్నావా - జల్లే అవుతుంది
హత్తుకున్నావా - వెల్లువవుతుంది
====================
రచన - సుద్దాల అశోక్
Sunday, December 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment